- ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ పరిధిలో కల్లు అమ్మకాలపై చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు చుట్టూ ఐదు కిలోమీటర్ల వరకు కల్లు దుకాణాల మూసివేతకు ఏం చర్యలు తీసుకుంటున్నారో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో కల్లు దుకాణాల మూసివేతకు చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన వినతి పత్రంపై స్పందించకపోవడాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎస్.బాలరాజ్ హైకోర్టులో పిల్ వేశారు.
దీనిని గురువారం కోర్టు విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్‌తోపాటు ఐదు కిలోమీటర్ల పరిధిలో కల్లు దుకాణాల ఏర్పాటు చట్టవిరుద్ధమన్నారు. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల వరకు ఎలాంటి తాటి చెట్లు లేవని, ఇక్కడ విక్రయించే కల్లు కల్తీ అని తెలిపారు.అ వాదనలను విన్న ధర్మాసనం ఈ పిటిషన్‌ను పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌కు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రతివాదులైన ఎక్సైజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, డిప్యూటీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది.